News February 12, 2025

రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన దుబ్బాక ఆర్ఐ

image

దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి మండలంలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 13, 2025

HYD: పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి

image

తరచుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డా.గోపాలకృష్ణ అన్నారు. బాచుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. తమ అభిరుచులను పిల్లలమీద రుద్దకుండా వారికి ఇష్టమైన సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని చెప్పారు.

News February 13, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,300 పలకగా.. నేడు రూ.14,000కి పెరిగింది. అలాగే 341 మిర్చికి నిన్న రూ.13,550 ధర రాగా.. ఈరోజు రూ.13,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి బుధవారం రూ.14,700 ధర రాగా.. ఈరోజు భారీగా పెరిగి రూ.16వేలకి ఎగబాకింది.

News February 13, 2025

కాకినాడ: వేరు వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య

image

కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా బుధవారం ఇరువురు మృతి చెందారు. అల్లూరిలోని గంగవరానికి చెందిన వీర ప్రసాద్ (27) గడ్డి మందు తాగి మృతి చెందాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడుకు చెందిన ఏసుబాబు (54) వేరే వారి గేదె చనిపోవడానికి తనే కారణమని ఆరోపించారు. రూ. 25 వేలు చెల్లించాలని పెద్దలు తీర్మానించారు. దీంతో విషం తాగి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!