News February 12, 2025

రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన దుబ్బాక ఆర్ఐ

image

దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి మండలంలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News March 20, 2025

‘కోర్టు’ కలెక్షన్లలో తగ్గేదేలే..

image

‘కోర్టు’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల తీర్పుతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు.

News March 20, 2025

కలిదిండి: గేట్‌లో 9వ ర్యాంకు సాధించిన సాయిచరణ్

image

కలిదిండి(M) ఆరుతెగలపాడు గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్ ఆల్ ఇండియా గేట్ ప్రవేశ పరీక్షలో 9వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. గతేడాది కాకినాడ JNTUలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాయిచరణ్.. గేట్ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే 9వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని సాయిచరణ్ తెలిపారు. ఐఐటీ చదవాలన్న తన ఆశయానికి తండ్రి కిశోర్, తల్లి పల్లవి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారన్నారు.

News March 20, 2025

నాగార్జునసాగర్‌కు భారీగా కేటాయింపులు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

error: Content is protected !!