News March 24, 2025

రూ.1.14 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు

image

విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. రెండు జిల్లాలలో మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా.. కోట్లు వసూలు అయినట్లు ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వెల్లడించారు.

Similar News

News October 29, 2025

చిత్తూరు: అంగన్వాడీల్లో CDPO తనిఖీలు

image

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో అంగన్వాడీలను తెరవలేదని Way2Newsలో <<18139694>>వార్త <<>>వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీడీపీవో అరుణశ్రీ స్పందించారు. మండలంలోని అంగన్వాడీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందు మూడు రోజులు సెలవులు అని చెప్పి.. ఇవాళ తిరిగి ఓపెన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. ఈక్రమంలో కాస్త ఆలస్యంగా సెంటర్లను ఓపెన్ చేశారని సీడీపీవో చెప్పారు. అన్ని సెంటర్లలో సిబ్బంది పనితీరు బాగుందన్నారు.

News October 29, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని బాలికను 2019 ఏప్రిల్‌లో అత్యాచారం చేసిన కేసులో నేరం నిర్ధారణ కావడంతో కళ్యాణ్ అనే నిందితుడికి జడ్జి శంకర్రావు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు.

News October 29, 2025

కాణిపాకంలో పేలిన సిలిండర్

image

కాణిపాకం కాలనీ హౌసింగ్ విభాగంలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో చిన్న పాపమ్మకు గాయాలు అయినట్లు సమాచారం. క్షతగాత్రురాలిని తక్షణమే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఇంటి గోడలు, పైకప్పు భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.