News February 17, 2026

రూ.10 కోట్లు చెల్లించాల్సిందే.. విశాల్‌కు కోర్టు ఆదేశం

image

ప్రముఖ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లైకా ప్రొడక్షన్స్‌కు వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇందుకు ఆరు వారాల సమయం కావాలంటూ హీరో మరో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టేసింది. గడువు ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా సినిమా తీస్తానని విశాల్ తమ వద్ద రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదంటూ లైకా 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

Similar News

News March 17, 2026

IPL తొలి మ్యాచులకు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం!

image

IPL-2026 ప్రారంభంలో కొన్ని మ్యాచులకు AUS ప్లేయర్లు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. RCBకి ప్రాతినిధ్యం వహిస్తున్న హేజిల్‌వుడ్ తొలి 2 మ్యాచులు ఆడకపోవచ్చని Cricbuzz పేర్కొంది. అటు SRH కెప్టెన్ కమిన్స్ కూడా IPLలో లేట్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలిపింది. వీరిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 28న జరిగే ఓపెనింగ్ మ్యాచులో RCB, SRH తలపడనున్నాయి.

News March 17, 2026

తిరుమలలో గ్యాస్ కొరత.. పలు దుకాణాలు మూసివేత!

image

AP: తిరుమలలో గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో పలు టీ షాప్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిర్వాహకులు మూసివేశారు. సిలిండర్ల కోసం గోడౌన్ వద్ద బారులు తీరారు. కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది.

News March 17, 2026

ఆధారాలివిగో.. KTR రాజీనామా చెయ్: సీతక్క

image

TG: మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ₹57000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రిపోర్టులు చూపిస్తే రాజీనామా చేస్తానన్న KTR <<19406367>>సవాల్‌పై<<>> మంత్రి సీతక్క స్పందించారు. అందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేస్తూ… సవాల్‌కు కట్టుబడి KTR రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు ₹57000 కోట్లు రుణాలివ్వడమే కాకుండా వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇప్పటివరకు ₹1,390 కోట్లు వడ్డీ కింద చెల్లించామని వివరించారు.