News July 2, 2024

రూ.10 లక్షల చెక్కు అందించిన డిప్యూటీ సీఎం పవన్

image

గొల్లప్రోలులో సోమవారం పెన్షన్ల పంపిణీ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.10 లక్షల బీమా చెక్కును లబ్ధిదారు చెక్క చిట్టితల్లికి అందించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీ ద్వారా బీమా పరిహారాన్ని అందజేశారు. పాలసీ తీసుకున్న వ్యక్తి కరెంటు స్తంభంపై పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా.. అతని భార్యకు బీమా చెక్కు అందించారు. తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.

News January 8, 2026

బ్లో అవుట్ వివరాలు సీఎంకు తెలిపిన ఎంపీ హరీష్

image

ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీ హరీశ్ బాలయోగిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయంలో కలిసిన ఎంపీని ఘటన తీవ్రతను అడిగారు. త్వరలోనే బ్లో అవుట్ ప్రాంతాన్ని సందర్శించి, ఏరియల్ సర్వే నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News January 7, 2026

సంక్రాంతికి నిడదవోలు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు: DM

image

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధనుంజయ్ తెలిపారు. ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు నిడదవోలు – విజయవాడ మార్గంలో నాలుగు ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రధాన ప్రాంతాలకు సర్వీసులను ఏర్పాటు చేస్తామని, ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.