News October 30, 2024
రూ.11.16 కోట్లతో R&B రోడ్లకు మరమ్మతులు: కలెక్టర్
కర్నూలు జిల్లాలో 412 కి.మీ R&B రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం రూ.11.16 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ పనులు రెండు, మూడు రోజుల్లో మొదలు కావాలని R&B అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రోడ్ల నిర్మాణంపై సంబంధిత శాఖ ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్షించారు.
Similar News
News November 4, 2024
భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల క్షేత్రం
కార్తీక మాసం, మొదటి సోమవారం పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చారు. భక్తులు ఉచిత, ఆర్జిత సేవ టికెట్లతో క్యూ లైనల్లో గంటల తరబడి వేచి ఉండి శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.
News November 4, 2024
నంద్యాల చిత్రకారుడికి అవార్డు
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ వేసిన దేవసుర చిత్రానికి భారతీయ చిత్రకళ అవార్డు వచ్చింది. ఆదివారం ఒంగోలులో కళాయజ్ఞ సృష్టి ఆర్ట్ అకాడమీ వారు ‘ప్రాచీన భారత్’ అనే అంశంపై పెయింటింగ్ పోటీలు, చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. 100 మంది చిత్రకారులు పాల్గొని వారు వేసిన చిత్రాలు ప్రదర్శించారు. అందులో మొదటి బహుమతి కోటేశ్‌కు దక్కింది.
News November 4, 2024
కర్నూలు కలెక్టరేట్‌లో నేడు డీఆర్సీ సమావేశం
కర్నూలు జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశాన్ని నేడు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరు కానున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన చర్చించనున్నారు.