News April 11, 2024
రూ.1291.96 కోట్ల విలువైన సామగ్రి సీజ్: ఏలూరు లెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే సీజ్ చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా రూ.1291.96 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు.
Similar News
News March 5, 2026
ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
News March 5, 2026
9న భీమవరం వస్తున్న షర్మిల!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
News March 5, 2026
ప.గో: బైక్ ఢీకొని యువకుడి మృతి

నరసాపురం మండలం సీతారామపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణ కోల్పోయారు. శేరేపాలెం గ్రామానికి చెందిన చిలకపాటి జేమ్స్ (32) హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాళీపట్నంకు చెందిన సంజీవరావు తన బైక్‌తో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జేమ్స్ నరసాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


