News March 28, 2025

రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

image

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.

Similar News

News February 27, 2026

రైల్వేస్టేషన్‌లో స్పృహ కోల్పోయిన వ్యక్తి మృతదేహం ఇంకా మార్చురిలోనే

image

విశాఖ రైల్వేస్టేషన్‌లో ఈ నెల23న ప్లాట్ఫారం1 గేట్ నం.3 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ వ్యక్తిని రైల్వేపోలీసులు గమనించి KGHకి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. ఆ మృతదేహం ఇంకా KGH మార్చూరిలో ఉండగా, మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.

News February 27, 2026

భారత్ ఘన విజయం

image

T20WC: జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్య ఛేదనలో ZIM బ్యాటర్లు 184-6 రన్స్‌కే పరిమితమయ్యారు. బెనెట్(97*) ఒంటరి పోరాటం చేశారు. కెప్టెన్ రజా(31) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్, అక్షర్, దూబే తలో వికెట్ తీశారు. మార్చి 1న వెస్టిండీస్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది.

News February 26, 2026

జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం- కలెక్టర్

image

వయోజనులకు అక్షరాభ్యాసం జరిగితేనే రాష్ట్రం, జిల్లా అక్షరాస్యతలో ముందుకు వెళ్తుందని డా.కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయడమే లక్ష్యమన్నారు. వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పాలన్నారు. మార్చి 15న మొదటి దశలో అక్షరాభ్యాసం పొందిన వారికి చివరి పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరీక్షలు సమర్థంగా నిర్వహించాలన్నారు.