News March 26, 2024
రూ.150 కోసం వెంటపడితే.. ప్రాణాలు పోయాయి!

ఏలూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెదవేగి మండలం వేగివాడ సెంటర్‌లో సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన హోటల్‌కు సోమవారం కొందరు వచ్చి టిఫిన్ చేశారు. బిల్ మొత్తం రూ.150 కాగా.. వారు రూ.15 ఫోన్ పేలో చెల్లించి వెళ్లిపోయారు. దీంతో సత్యనారాయణ బైక్‌పై సోదరి, కుమార్తెతో వారివెంటే వెళ్లారు. తిరిగి వస్తుండగా చక్రాయగూడెం సమీపంలో కారు ఢీకొని సత్యనారాయణ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు రాస్తారోకో చేపట్టారు.
Similar News
News March 18, 2025
ప. గో: ప్రయోగాత్మకంగా గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్

జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ రూపొందించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్లో డీఆర్‌డీఏ, వ్యవసాయ, ఇరిగేషన్, డీపీవో, టూరిజం శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ రూపొందించడంపై చర్చించారు. గుర్రపు డెక్కతో ఆర్నమెంటల్ వస్తువులను కూడా రూపొందించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
News March 17, 2025
సబ్ కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ కార్యక్రమం

నరసాపురం సబ్ కలెక్టరేట్లో ఈనెల 17న తేదీన సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. సబ్ డివిజన్లోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో యథావిధిగా జరుగుతుందన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులు, దరఖాస్తులను ఉదయం 10:30 గంటల నుంచి అందించాలని కోరారు.
News March 16, 2025
ప.గో.జిల్లా వ్యాప్తంగా 128 టెన్త్ పరీక్ష కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 128 సెంటర్ల ద్వారా 22,432 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ తెలిపారు. వీరిలో 11,407 మంది బాలురు కాగా 11,025 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు.