News March 28, 2025

రూ.165 లక్షలతో ఆరోగ్య సేవల మెరుగు..IOCL

image

ఇండియన్ ఆయిల్ TAPSO HYDలో ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు 3 ఒప్పందాలు కుదుర్చుకుని రూ.165 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ నిధులతో స్వీకార్ అకాడమీలో ఆటిజం బాధిత పిల్లలకు ప్రత్యేక సంరక్షణ, కోఠిలో ప్రభుత్వ ENT ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్నవారికి అవసరమైన పరికరాలు, మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Similar News

News April 19, 2025

NGKL: ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించిన MLA రాజేశ్ రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుని ని విశ్రాంతి తీసుకుంటున్నాడు. శుక్రవారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాక్షించారు. నాయకులు పాల్గొన్నారు.

News April 19, 2025

నేడు నాగర్‌కర్నూల్‌కు మంత్రి పొంగులేటి రాక

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజా కన్వెన్షన్ హాల్‌లో జరిగే భూభారతి అవగాహన సదస్సుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి వస్తున్నట్లు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్ తెలిపారు. సదస్సులో పొంగులేటితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు,MLA రాజేశ్ రెడ్డి, MLC దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొంటారని తెలిపారు. వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు, ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

News April 19, 2025

30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే..

image

పురుషుల్లో ఒంటరితనం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో సంతానోత్పత్తి, గర్భాశయ సమస్యలు అధికమవుతాయి. లేటు మ్యారేజ్‌లో భాగస్వామితో గొడవలు, డివోర్స్ అవకాశాలు ఎక్కువట. మరోవైపు కుటుంబం, సమాజం నుంచి కూడా ప్రశ్నలు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. 30 ఏళ్లు దాటాక మనసుకు నచ్చకపోయినా వచ్చిన సంబంధాన్ని ఒప్పుకోక తప్పదు. రాజీపడాల్సి వస్తుంది.

error: Content is protected !!