News May 4, 2024
రూ.181 కోట్ల మద్యం విక్రయాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిమాండ్కు తగ్గట్లుగా బీర్ల నిల్వలు లేవు. ఉభయ జిల్లాల్లో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, మూడు క్లబ్స్ ఉన్నాయి. అయితే గతేడాది మే మొదటి, రెండు వారాల్లో 48 వేల లిక్కర్ కేసులు, లక్ష బీర్ల కేసులను దుకాణాలకు విక్రయించారు. వీటి విలువ రూ.50 కోట్లు. ఈసారి బీర్లకు డిమాండ్ అమాంతం పెరగటంతో ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఏప్రిల్లో రూ.181 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
Similar News
News January 6, 2026
ఖమ్మం: ఇటుక బట్టీల్లో వలస బతుకులు ఛిద్రం

ఖమ్మం జిల్లాలోని ఇటుక బట్టీల్లో వలస కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఒడిశా నుంచి పిల్లాపాపలతో వచ్చిన వందలాది కుటుంబాలు కనీస వసతులు లేని గుడారాల్లో ఉంటూ గొడ్డుచాకిరి చేస్తున్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్నా యజమానులు రక్షణ చర్యలు చేపట్టడం లేదని, అధికారుల పర్యవేక్షణ కరవైందని విమర్శలు వస్తున్నాయి. ‘ఆపరేషన్ స్మైల్’ వంటి కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News January 6, 2026
యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 12,682 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 25,773 టన్నుల ఎరువులను పంపిణీ చేశామని వివరించారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు నీడ, తాగునీటి వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
News January 6, 2026
ఖమ్మం జిల్లాకు 72 వసంతాలు.. 51 మంది కలెక్టర్ల ప్రస్థానం

ఖమ్మం జిల్లా ఆవిర్భవించి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పరిపాలనా ప్రస్థానాన్ని అధికారులు గుర్తుచేసుకున్నారు. 1953 OCT 1న జిల్లా ఏర్పడగా, ఇప్పటివరకు 51మంది కలెక్టర్లు సేవలందించారు. తొలి కలెక్టర్గా జి.వి. భట్ బాధ్యతలు చేపట్టగా, ప్రస్తుతం అనుదీప్ దురిశెట్టి కొనసాగుతున్నారు. వీరిలో ఎ. గిరిధర్ అత్యధికంగా 4 ఏళ్ల 21 రోజుల పాటు కలెక్టరుగా పనిచేసి రికార్డు సృష్టించారు.


