News March 25, 2025

 రూ. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మరిచిన BJP: యూత్ కాంగ్రెస్

image

బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరచిపోయిందంటూ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మున్నూరు రోహిత్ మంగళవారం పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు యూత్ కాంగ్రెస్ ధర్నాలు చేస్తామని తెలిపారు.

Similar News

News March 31, 2025

తిరుమలలో మద్యం, మాంసం.. వైసీపీ ఆగ్రహం

image

AP: తిరుమలలో మద్యం, మాంసం వినియోగం, అనుచిత ప్రవర్తన ఘటనలు పెరిగిపోయాయని YCP విమర్శించింది. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ పరిస్థితి దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘JAN 18న తమిళనాడు భక్తులు కొండపై ఎగ్ బిర్యానీ తిన్నారు. మార్చి 15న మద్యం మత్తులో యువకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. మార్చి 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ మద్యం తీసుకెళ్లాడు’ అని పేర్కొంది.

News March 31, 2025

స్టూడియో ghibli కోసం ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారా?

image

సోషల్ మీడియాలో స్టూడియో ghibli ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ చాట్ జీపీటీ లేదా గ్రోక్ వంటి ఏఐల ద్వారా ఫొటోల్ని అప్‌లోడ్ చేసి ఘిబ్లీ స్టైల్లోకి మార్చుకుంటున్నారు. ఇది చాలా రిస్క్ అంటున్నారు సైబర్ నిపుణులు. ‘మనం ఇష్టపూర్వకంగానే అప్‌లోడ్ చేస్తాం కాబట్టి యాప్‌లు ముఖ కవళికల్ని భద్రపరుచుకుంటాయి. దీని వల్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు కచ్చితంగా భంగం వాటిల్లుతుంది’ అని వివరిస్తున్నారు.

News March 31, 2025

సన్‌రైజర్స్‌తో చర్చలకు సిద్ధం: HCA

image

సన్‌రైజర్స్ జట్టుతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘మాకు కేటాయించిన వాటికి మించి అదనపు పాసుల్ని ఎప్పుడూ అడగలేదు. అసోసియేషన్ పరువుకు భంగం కలిగించే పద్ధతి మంచిది కాదు. మ్యాచ్‌లను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే మౌనం పాటిస్తున్నాం. ఏదేమైనా సన్‌రైజర్స్ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపాయి.

error: Content is protected !!