News July 19, 2024
రూ.2లక్షల రుణమాఫీ.. రైతులకు సైబర్ ALERT: డీఎస్పీ
ప్రభుత్వం రుణమాఫీ చేస్తుండటంతో సైబర్ మోసాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట డీఎస్పీ లింగయ్య శుక్రవారం అన్నారు. సైబర్ కేటుగాళ్లు బ్యాంకుల ఫోటోతో వాట్సాప్‌లో APK ఫైల్స్ పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నాని హెచ్చరించారు. ఫోన్లకు వచ్చే అనవసర లింకులు ఓపెన్ చేయవద్దని చెప్పారు. సందేహాలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి నివృత్తి చేసుకోవాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
Similar News
News December 12, 2024
నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి వద్ద జరిగిన రోడ్డు <<14853514>>ప్రమాదంలో <<>>ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. UP బల్‌రాంపూర్ జిల్లాకి చెందిన రాంప్రకాశ్(35), లవకుశ్(33) కల్వకుర్తి నుంచి మిడ్జిల్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు మీద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. కేసు నమోదైంది.
News December 12, 2024
MBNR: ‘ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు’
రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు అందజేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ప్రియబ్రతమిశ్రా చెప్పారు. MBNR SBI రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ..రైతుల కోసం రైతులే నిర్వహించుకునే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తమ బ్యాంకు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
News December 12, 2024
మరికల్: అంగన్వాడీ కేంద్రాలపై సైబర్ కేటుగాళ్ల.. జాగ్రత్త
అంగన్వాడి కేంద్రాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. బుధవారం మరికల్, నారాయణపేటలో డబ్బులు కాజేశారు. అంగన్వాడీ టీచర్లతో ఫోన్లో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడుగుతామని, మరికల్‌లో రూ.3వేలు, నారాయణపేటలో రూ.25వేలు దోచేశారని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా సైబర్ నేలగాలకు చిక్కడంతో ఫోన్స్ వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పారు.