News May 4, 2024
రూ: 2లక్షల 53 వేల విలువగల గంజాయి స్వాధీనం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో టూ టౌన్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో షేక్ షోయబ్ ను ఆరెస్ట్ చెయ్యగా, షేక్ సాదిక్ పరారీలో ఉన్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, దీని విలువ రూ: 2లక్షల 53 వేలు ఉంటుందని పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ అశోక్, ఎస్సై లాల్ సింగ్ నాయక్, తదితరులు ఉన్నారు.
Similar News
News January 3, 2025
MNCL: ‘బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం’
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదామని CP శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ పరిధి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం CP సమీక్ష నిర్వహించారు. CP మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31వ వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్-Xlను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రతి ఒక్క అధికారి ముగ్గురు పిల్లలను కాపాడాలని సూచించారు.
News January 3, 2025
ADB చేరుకున్న రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ షమీమ్ అక్తర్ గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి స్థానిక పెన్గంగా గెస్ట్ హౌస్లో ఆయనను కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
News January 2, 2025
ఇంద్రవెల్లి: జనవరి 28 నుంచి నాగోబా జాతర
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్వహించే నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతరపై గురువారం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దర్బార్ హాల్లో జిల్లా అధికారులు, దేవాదాయ, దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జాతరకు లక్షలాది మంది ఆదివాసీలు, గిరిజనులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.