News March 26, 2025

రూ.2 కోట్లు.. సచివాలయం చెల్లించాల్సిన ఆస్తి పన్ను

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఘనంగా, గొప్పగా నిర్మించిన ప్రభుత్వం ఆ భవనానికి సంబంధించి ఆస్తి పన్ను ఇంకా చెల్లించలేదు. మహానగర వ్యాప్తంగా ఆస్తిపన్ను వసూలు చేస్తున్న అధికారులకు పెండింగ్ బిల్లు జాబితాలో రాష్ట్ర సచివాలయం కనిపించింది. దాదాపు రూ.2 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మార్చి 31లోపు ఈ మొత్తాన్ని ఎలా రాబట్టాలని గ్రేటర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

Similar News

News April 1, 2025

HYD: ఏప్రిల్ 3న కొత్త ఎక్సైజ్ స్టేషన్స్ ప్రారంభం

image

HYD: కొత్త ఎక్సైజ్ స్టేషన్లు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. గండిపేట, అమీన్పూర్ ఎక్సైజ్ స్టేషను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్లో 13 వరంగల్ రూరల్‌లో ఒక కొత్త ఎక్సైజ్ స్టేషన్లను ఏప్రిల్ 1న బదులు ఏప్రిల్ 3న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3న కొత్త స్టేషన్లు ప్రారంభించడానికి రాష్ట్ర ఎక్సైజ్ నిర్ణయం తీసుకుంది.

News March 31, 2025

HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

image

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.

News March 31, 2025

రంజాన్ వేళ.. HYDలో వీటికి ఫుల్ DEMAND

image

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్‌లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.

error: Content is protected !!