News September 5, 2024

రూ.2 లక్షల విరాళమిచ్చిన అమలాపురం క్రీడాకారుడు

image

అమలాపురానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ కుటుంబ సభ్యులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళం సొమ్మును సాత్విక్ రాజ్ తల్లిదండ్రులు రంగమణి, కాశీ విశ్వనాథ్ అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ మహేష్ కుమార్‌కు అందజేశారు. కలెక్టర్ వారిని అభినందించారు.

Similar News

News November 28, 2024

రాజమండ్రి బ్రిడ్జికి నిధుల విడుదల

image

రాజమండ్రి హేవ్ లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్స్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా రూ.62.33 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఈ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ.94.44 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు వ్యయం చేసిన తరువాత మిగిలిన నిధులను విడుదల చేయనున్నారు.

News November 28, 2024

రాజమండ్రి: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన SP

image

రాజమండ్రిలోని తూ.గో జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రౌడీ షీటర్లు& పాత ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నాటు సారా, గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేయాలని ఆదేశించారు. సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.

News November 27, 2024

రాజమండ్రి: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

image

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూ.గో జిల్లా SP నర్సింహ కిషోర్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 25న రాజమండ్రికి చెందిన బి.రమేష్ SVS కోచింగ్ సెంటర్‌‌పై గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై అతను 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విశాఖ జిల్లాకు చెందిన నిందితుడు డి.నాగేశ్వరావును అదుపులోకి తీసుకున్నారు.