News November 27, 2024

రూ.25 కోట్లకు పైగా అవినీతి సొమ్ము దాచిన శ్రీకాకుళం జిల్లా అధికారి

image

విశాఖకు చెందిన సింహాచలం విశాఖపట్నం జోన్-2 మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారని అభియోగంపై ACB మంగళవారం కేశవరావుపేట, కింతలి, శ్రీకాకుళం టౌన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల రూ.25కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బంగారు, భూములు గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళంలో ACB బీనామిలు, కుటుంబ సభ్యుల ఇంట్లో దాడులు నిర్వహించారు.

Similar News

News September 19, 2025

SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

image

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News September 19, 2025

ఎచ్చెర్ల: యూనివర్సటిలో సంస్కృతి కోర్సు ప్రారంభం

image

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటిలో సంస్కృతి కోర్సును వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కే ఆర్ రజిని ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం ఉష నిధుల ఆర్థిక సహకారంతో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును మొదలపెట్టామని చెప్పారు. సంస్కృతం భాష నుంచే మిగతా భాషలు వృద్ధి చెందాయని తెలియజేశారు.

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

▶మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీ వద్దు.. గ్రామం ముద్దు
▶జిల్లాలో పలుచోట్ల యూరియా కోసం రైతుల అవస్థలు
▶SKLM: ఎంపీ నిధులతో ప్రాంతీయ ప్రాంతాల అభివృద్ధి
▶GST 2.0పై మాట్లాడిన ఎమ్మెల్యే గౌతు శిరీష
▶బూర్జ: ధర్మల్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలి
▶పొందూరు: ఈ ప్రయాణాలు..ప్రమాదం
▶సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శంకర్
▶రైతు సమస్యలపై సభలో చర్చిస్తాం: అచ్చెన్నాయుడు