News February 27, 2026

రూ. 250 కోట్ల భూమి.. సర్కారు నిర్ణయం ఏమిటో?

image

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనంతరం.. స్వాధీనం చేసుకున్న 31.07 ఎకరాల వినియోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భూమి విలువ సుమారు రూ. 250 కోట్లు ఉంటుందని కలెక్టరే ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఖరీదైన ఈ భూముల్లో సామాన్యులకు ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాలు లేదా ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Similar News

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. 19వ స్థానంలో మంచిర్యాల

image

ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంచిర్యాల(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4,741 మంది పరీక్షలు రాయగా 3,396 మంది పాసై 71.63% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 784 మందికి 601 మంది పాసై 76.66 శాతంతో 10వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 486 మందికి 162 మంది పాసై 33.33%తో 14వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 46 మందికి 25 మంది పాసై 54.35%తో 14వప్లేస్ వచ్చింది.

News April 12, 2026

‘డెకాయిట్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. షానియెల్ డియో డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు రూ.15కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.