News April 2, 2025

రూ.266 కోట్లతో అభివృద్ధి పనులు: అన్నమయ్య కలెక్టర్

image

ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంచ ప్రాధాన్యాల లక్ష్యాన్ని నిర్దేశించిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. 2025-26 మొదటి త్రైమాసికానికి రూ.266కోట్ల లక్ష్యంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. రూ.43కోట్ల అంచనాతో 10వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం, రూ.100 కోట్లతో సీసీ రోడ్లు, మినీ గోకులాల నిర్మిస్తామన్నారు.

Similar News

News November 26, 2025

ఫైనల్‌కు ఉమ్మడి ఖమ్మం అండర్-19 గర్ల్స్ జట్టు

image

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న అండర్-19 గర్ల్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి పూల్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో మెదక్ జట్టుపై గెలిచిన ఖమ్మం జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ పోరులో ఖమ్మం, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

News November 26, 2025

సేంద్రియ పెంపకం యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్

image

సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ కొత్తూరులోని చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతులు, పరిశుభ్రత ప్రమాణాలు, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

News November 26, 2025

బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

image

UP మీరట్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్‌లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.