News January 22, 2025

రూ.291.67 కోట్లతో కర్నూలు నగరపాలక అంచనా బడ్జెట్‌

image

కర్నూలు నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాల బడ్జెట్‌ను స్థాయీ సంఘం ఆమోదించింది. నగరపాలక కార్యాలయంలో మేయర్ బీవై రామయ్య అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. రూ.291.67 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేశారు. మొత్తం ఆదాయం రూ.363.99 కోట్లు, ఖర్చు రూ.201.22 కోట్లు, రెవెన్యూ ఆదాయం రూ.201.22 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.162.77 కోట్లు, మూలధన రాబడి రూ.138.69 కోట్లు.

Similar News

News January 8, 2026

కర్నూలు జిల్లాలో 78 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కర్నూలు జిల్లాలోని KGBVల్లో 78 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 56, టైప్-4 కేజీబీవీల్లో 22 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.

News January 8, 2026

విద్యార్థులకు సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళా రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శక్తి యాప్, శక్తి వాట్సాప్ నంబర్ 7993485111, డయల్ 100 వంటి సేవలపై శక్తి టీంలు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రతి విద్యార్థి హెల్మెట్ వాడకం, సైబర్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళల రక్షణకు పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

News January 8, 2026

త్వరగా పరిష్కారం చూపండి: కలెక్టర్

image

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన, నాణ్యత కలిగిన పరిష్కారాన్ని చూపించాలని తహశీల్దార్లను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు డివిజన్‌లో రెవెన్యూ క్లినిక్, రెవెన్యూ స్పెషల్ క్యాంప్‌ల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. వచ్చిన అర్జీలకు వెంటనే నోటీసులు ఇచ్చి, నిర్దేశిత గడువు లోపు వాటిని పరిష్కరించాన్నారు.