News May 12, 2024
రూ.3.47కోట్ల నగదు సీజ్

పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు తనిఖీల్లో రూ.3,47,31,750 నగదు సీజ్ చేయగా, సరైన ఆధారాలు చూపించడంతో రూ.2,61,05,180 నగదు విడుదల చేశామని సీపీ సునీల్ దత్ తెలిపారు. రూ.1,06,40,532 విలువైన మద్యం, రూ.24,39,600 విలువైన గంజాయితో పాటు రూ.20,07,500 విలువైన ఇతర సామగ్రి సీజ్ చేశామని వెల్లడించారు. పోలింగ్ సమీపిస్తున్నందున తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 20, 2025
ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 20, 2025
తండ్రి దాడిలో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి

ఖమ్మం కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తన భార్య సాయి వాణిని భర్త భాస్కర్ అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా మొదట తన కన్న కూతురిని చంపేందుకు భాస్కర్ ప్రయత్నించగా అతడి నుంచి చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. ఈ దాడి ఘటనలో చిన్నారి మూడు వేళ్లు తెగిపోయాయని స్థానికులు తెలిపారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 20, 2025
ఖమ్మం: అమ్మ ఆదర్శ కమిటీలకు నిధులు విడుదల

ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణ కోసం ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ఖాతాలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిధులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,160 పాఠశాలలకు సంబంధించి మొత్తం రూ.1,13,78,000 నిధులను విడుదల జారీ చేశారు. రెండు నెలల కాలానికి ఉద్దేశించిన ఈ నిధులను ఏఏపీసీ సభ్యులు పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు, టాయిలెట్ల శుభ్రత, ఆవరణ నిర్వహణ కోసం వినియెాగించాలని సూచించారు.


