News May 12, 2024

రూ.3.47కోట్ల నగదు సీజ్

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు తనిఖీల్లో రూ.3,47,31,750 నగదు సీజ్ చేయగా, సరైన ఆధారాలు చూపించడంతో రూ.2,61,05,180 నగదు విడుదల చేశామని సీపీ సునీల్ దత్ తెలిపారు.  రూ.1,06,40,532 విలువైన మద్యం, రూ.24,39,600 విలువైన గంజాయితో పాటు రూ.20,07,500 విలువైన ఇతర సామగ్రి సీజ్ చేశామని వెల్లడించారు. పోలింగ్ సమీపిస్తున్నందున తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 18, 2025

ఖమ్మం: ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం

image

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 3,29,743 ద్వారా రూ.6,49,30,640 ఆదాయం వచ్చింది. అత్యధికంగా మే నెలలో జిల్లాలో 35,199 పార్శిళ్ల బుకింగ్‌ ద్వారా రూ.68,46,890 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్‌లో 33,588 పార్శిళ్ల ద్వారా రూ.68,97,835 ఆదాయం లభించింది. అలాగే ఇతర ప్రాంతాలకు 1,740 పార్శిళ్లు హోం డెలివరీ ద్వారా రూ.4,84,050 ఆదాయం వచ్చింది.

News February 18, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} ఖమ్మంలో రైతుల మహా ధర్నా కార్యక్రమం∆} తల్లాడలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News February 18, 2025

కనకగిరి ఫారెస్ట్‌‌లో నిపుణుల పర్యటన

image

కనకగిరి ఫారెస్ట్‌‌లో వన్యప్రాణి నిపుణులు 12గంటల పాటు కాలినడకన పర్యటించారు. 12 మంది నిపుణులు 4 కీ.మీ.ల అడవిని పరిశీలించి వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఫారెస్ట్‌ ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని పేర్కొన్నారు.

error: Content is protected !!