News January 29, 2025
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహశీల్దార్ జాహ్నవి బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైతుకు పాస్ బుక్ ఇచ్చేందుకు తహశీల్దార్ జాహ్నవి, VROతో కలిసి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టగా ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కినట్లు సమాచారం.
Similar News
News December 8, 2025
HYDలో అక్కడ ఒక్క రూపాయికే టిఫిన్

HYDలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో భోజనం కోసం బిక్కు బిక్కుమంటూ తిరిగే వాళ్లెందరో. అలాంటి వారిని చూసి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ‘కరుణ కిచెన్’ జార్జ్ రాకేశ్‌బాబు రూపాయికే టిఫిన్ పెడుతున్నట్లు తెలిపారు. రోజూ మెనూ ఛేంజ్ చేస్తూ దాదాపు 300 మంది కడుపు నింపుతున్నారు. ఉ.7 గం.- 9 గం. వరకు 2 గంటలు కొనసాగుతోంది. ‘డబ్బు కోసం కాదు.. నలుగురి కడుపు నింపేందుకు. ఇందులోనే నా సంతోషం ఉంది’ అని తెలిపారు.
News December 8, 2025
ADB: బాండు పేపర్లు.. విచిత్ర హామీలు

పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు అలవికాని హామీలు ఇస్తున్నారు. తాజాగా నార్నూర్ మండలంలో బాండు పేపర్ రాసిచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఇలాగే పలువురు గ్రామానికి ఫలానా పని చేసి ఇస్తాం.. మీ కులం వారికి భవనం కట్టిస్తాం.. మీ కులం వారికి వంట సామగ్రి పంపిణీ చేస్తాం అంటూ హామీలు ఇస్తున్నారు. ఆలయాభివృద్ధికి తోడ్పాటునందిస్తాం.. వీడీసీలకు నగదు ఇస్తామంటూ ఓట్లు అడుగుతున్నారు.
News December 8, 2025
సూర్యాపేట: ఎన్నికలు కలిపాయి వారిని..!

మొన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటాల తూటాలు పేల్చుకున్న వివిధ పార్టీల నాయకులు నేడు ఒక్కటయ్యారు. వైరం మరిచి తమ పార్టీ బలపరిచిన నాయకుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తుంగతుర్తి, వెలుగుపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కొట్లాడుతున్నాయి. ఆత్మకూరు(S)లో కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం పొత్తు పెట్టుకోగా.. కందగట్లలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఫైట్ చేస్తున్నాయి.


