News October 28, 2024
రూ.300 కోట్లతో తిరుపతి స్టేషన్ అభివృద్ధి
ఏపీలో దాదాపు రూ.1397 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే వివిధ స్టేషన్లు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి స్టేషన్ను రూ.300 కోట్లతో ఆధునికీకరించనున్నారు. అంతర్జాతీయ హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సంబంధిత పనులకు ప్రధాని మోదీ ఇటీవల వర్చువల్గా శంకుస్థాపన చేయడంతో జోరుగా పనులు జరుగుతున్నాయి. పనులన్నీ పూర్తి అయ్యాక తిరుపతి రైల్వే స్టేషన్ పైఫొటోలో ఉన్నట్లు కనిపిస్తుంది.
Similar News
News December 25, 2024
అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన
తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.’ అంటూ ట్విట్టర్లో విమర్శించారు.
News December 25, 2024
తిరుపతి: వైకుంఠ ఏకాదశికి పటిష్ఠ బందోబస్తు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో తోపులాటలు చోటు చేసుకోకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించేలా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి క్యూ లైన్లలో తోపులాటలు జరపకుండా టోకెన్లు పొందాలని సూచించారు. టీటీడీ, పోలీసుల సూచనలు పాటించాలన్నారు.
News December 25, 2024
చిత్తూరు: వార్షిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ
చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మణికంఠ వార్షిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరించాలన్నారు. చోరీలకు అడ్డకట్టవేసేలా నిఘా పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేశారు.