News April 13, 2025
రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్: మంత్రి లోకేశ్

మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరైందని, పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి రూరల్ యర్రబాలెంలోని మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా 5వరోజు మహానాడు కాలనీవాసులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఆయన మాట్లాడారు. మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News March 17, 2026
GNT: రూ.10 కోట్లతో ఫైనాన్స్ యజమాని పరార్

లక్ష పెడితే నెలకు రూ. 10 వేల లాభమంటూ నమ్మించిన ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని వందల మందికి టోకరా వేశాడు. గుంటూరు అరండల్‌పేటలో ‘ట్రేడ్ దోస్త్’ పేరుతో సంస్థ నడిపిన బాపట్లకు చెందిన వెంకట పూర్ణచంద్రరావు.. ఏజెంట్ల ద్వారా సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
News March 17, 2026
గుంటూరు: పోలీస్ సిబ్బంది సమస్యలపై ఎస్పీ ఆరా

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్’ కార్యక్రమం నిర్వహించారు. SP వకుల్ జిందాల్ స్వయంగా సిబ్బంది నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధి నిర్వహణలో అనుకూల వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎస్పీ అన్నారు.