News September 19, 2024

రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల అరెస్టు: ఎస్పీ

image

ధర్మవరంలో ముంబై పోలీసులమని చెప్పి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరం ఒకటో పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నరేశ్ గోయల్ అనే వ్యక్తి రూ.500 కోట్లు బ్యాంక్‌లో రుణం తీసుకుని మీ ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News October 10, 2024

మైనర్లను పనిలో ఉంచుకోవడం నేరం: ఎస్పీ

image

మైనర్ పిల్లలను పనులలో ఉంచుకోవడం నేరమని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన పుట్టపర్తితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు మోటార్ మెకానిక్ షాపులు, గుజిరి, కిరాణా షాపులను తనిఖీ చేశారు. 14 ఏళ్ల లోపు పిల్లలను దుకాణాలలో పనికి పెట్టుకోరాదని, వారి హక్కులకు భంగం కలిగించుట నేరమని తెలిపారు.

News October 10, 2024

రోకలి బండతో మోది భర్తను చంపిన భార్య

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ధర్మపురిలో దేవరకొండ గోవింద్(60) అనే వ్యక్తిని భార్య అంజమ్మ ఇంటిలో రోకలిబండతో తలపై మోది చంపింది. మద్యం తాగి వచ్చి తరచూ అంజమ్మను తిడుతూ వేధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన అంజమ్మ.. భర్తను రోకలి బండతో కొట్టి చంపింది. ధర్మవరం రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

News October 10, 2024

ఏపీ ప్రజలతోనూ రతన్ టాటాకు అనుబంధం: మంత్రి పయ్యావుల

image

ఏపీ ప్రజలతో దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాకు మంచి అనుబంధం ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో మంత్రివర్గం టాటాకు నివాళులు అర్పించింది. ఉప్పు నుంచి ఉక్కు దాకా టాటా గ్రూప్ అనేక సంస్థలను స్థాపించిందని, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిదని గుర్తు చేసుకున్నారు. టాటా సంస్థలు ఇప్పటికీ ఏపీ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.