News August 1, 2024

రూ.4 వేలు ఇచ్చే రాష్ట్రం మనదే: నారాయణ

image

నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంటింటికీ తిరిగి నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలకు రూ.4 వేల పింఛన్ అందజేసే ఏకైక రాష్ట్రం ఏపీ అని కొనియాడారు. ఆయన వెంట నగర కమిషనర్ సూర్యతేజ, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News December 22, 2024

నెల్లూరు జిల్లాలో తులం బంగారం రూ.78,470

image

నెల్లూరు జిల్లాలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,470లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.7,100లుగా ఉంది. కాగా 24 క్యారెట్ల బంగారం ధర శనివారంతో పోల్చితే రూ.700కు పెరిగింది. గడిచిన కొద్ది రోజులుగా జిల్లాలో మేలిమి బంగారం ధరలు తులం రూ.78వేలకు పైగా ఉండగా శనివారం కాస్త తగ్గి రూ.77వేలకు చేరింది.

News December 22, 2024

నెల్లూరు: బీచ్‌లో యువకుడు మృతి

image

ఆయన ఉద్యోగం కోసం కొద్ది రోజుల్లో గల్ఫ్ వెళ్లాలి. సరదాగా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడం కోసం బీచ్‌కు వెళ్లగా.. అదే అతడి చివరి రోజుగా మారింది. SI నాగబాబు వివరాల మేరకు.. దొరవారిసత్రం(M) తనయాలికి చెందిన సతీశ్, చెంచుకృష్ణ, మునిశేఖర్ రెడ్డి స్నేహితులు. సతీశ్‌కు గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో సరదాగా గడిపేందుకు తూపిలిపాలెం బీచ్‌కు వెళ్లగా.. అలల తాకిడికి సతీశ్ కొట్టుకుపోయి చనిపోయాడు.

News December 22, 2024

నెల్లూరు: వైభవంగా లక్ష్మి నరసింహ స్వామి పల్లకి సేవ 

image

నెల్లూరు కలకొండ కొండపై గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి సమేతుడై పల్లకిలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహ నామ స్మరణతో దేవాలయం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.