News August 1, 2024
రూ.4 వేలు ఇచ్చే రాష్ట్రం మనదే: నారాయణ

నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంటింటికీ తిరిగి నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలకు రూ.4 వేల పింఛన్ అందజేసే ఏకైక రాష్ట్రం ఏపీ అని కొనియాడారు. ఆయన వెంట నగర కమిషనర్ సూర్యతేజ, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 18, 2026
నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో గ్రీవెన్స్ డే సోమవారం జరగనుంది. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా అధికారులకు అందజేయవచ్చని చెప్పారు. Meekosam.ap.gov.in, 1100 కాల్ సెంటర్ ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News January 18, 2026
నెల్లూరు: 9లక్షలకు పైగానే ఫ్రీ బస్ ఎక్కారు..!

సంక్రాంతి కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడాయి. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టాక వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో మహిళలు సొంతూళ్లకు ఉచితంగా ప్రయాణం చేశారు. ఈనెల 8 నుంచి 16వ వరకు నెల్లూరు జిల్లాలోని 7 డిపోల పరిధిలో 9,55,083 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు గాను ప్రభుత్వంపై రూ.3,89,85,130 భారం పడింది.
News January 18, 2026
వాహనదారులకు నెల్లూరు ఎస్పీ సూచనలు

నెల్లూరు జిల్లాలో పొగ మంచు ఎక్కువైంది. ఈక్రమంలో వాహనదారులకు ఎస్పీ డా.అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.


