News December 28, 2024
రూ.40 లక్షలు విలువచేసే రత్నాంగి కవచాలు విరాళం
భద్రాద్రి రాములవారికి HYD వాస్తవ్యులు రూ.40 లక్షలు విలువ చేసే రత్నాంగి కవచాలను శనివారం విరాళంగా ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు. ఈ కవచాలల్లో 51 వేల రత్నాలు ఉన్నాయని ఈవో తెలిపారు. దాతలు పిన్నమనేని బాలమురళీకృష్ణ, శాంతి దంపతులు, వారి కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు.
Similar News
News January 1, 2025
ఖమ్మం: ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.20,506
ఆయిల్‌పామ్ సాగు రైతులకు అదృష్టయోగం పట్టింది. ఆయిల్‌పామ్ గెలల ధర మూడు నెలలకు భారీగా పెరిగింది. టన్ను గెలల ధర అక్టోబర్‌లో రూ.19,140 వరకు ఉంది. ఇది నవంబర్, డిసెంబర్ నెలలకు రూ.20,413 వరకు పెరిగింది. ఈ నెలలో(జనవరి) పామాయిల్ టన్ను ధర రూ.20,506గా నిర్ణయిస్తూ తెలంగాణ ఆయిల్ ఫెడ్ అధికారులు ప్రకటించారు. గత మూడు నెలలుగా ఆయిల్‌పామ్ ధర పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు.
News January 1, 2025
కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీరామచంద్రుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు స్వామివారిని కూర్మావతారంలో అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి నిత్యకళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో ఈవో రమాదేవి పాల్గొన్నారు.
News January 1, 2025
ఖమ్మం: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ప్రేమ విఫలమే కారణం..?
మధిర మండలం కృష్ణాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో << 15026926>>ఇంటర్ విద్యార్థి<<>> సాయివర్ధన్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు ప్రిన్సిపల్ శ్రీనివాస్, వార్డెన్ మోషేను సస్పెండ్ చేశారు. కాగా విద్యార్థి జేబులో ఓ లేఖ దొరికింది. వైరా ACP రెహమాన్ లేఖను పరిశీలించి ప్రేమలో విఫలమైనట్లు తెలుస్తోందన్నారు. ‘లవ్ చేయొద్దు రా’ అని సూసైడ్‌కు ముందు తమతో సాయి చెప్పాడని ఫ్రెండ్స్ తెలిపినట్లు సమాచారం.