News January 24, 2026
రూ.52 కోట్ల జరిమానాపై సంతృప్తి: బాపట్ల MP

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అధికారులు పూర్తిగా అరికట్టాలని MP తెన్నేటి కృష్ణ ప్రసాద్ సూచించారు. గడిచిన మూడేళ్లలో అక్రమ తవ్వకాలపై రూ.52 కోట్లు జరిమానా విధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 3 మున్సిపాలిటీల్లో అమృత్-2 కింద నీటి ట్యాంకుల అభివృద్ధికి రూ.96.45 కోట్లు విడుదలయ్యాయన్నారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ శాఖ ద్వారా పనులకు టెండర్లు పిలువగా, టెండర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 17, 2026
NRPT: మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.
News February 17, 2026
అనకాపల్లి: విజయవంతంగా ముగిసిన శాప్ లీగ్ చెస్ టోర్నమెంట్

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి శాప్ లీగ్ చెస్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అదేశాల మేరకు నిర్వహించిన పోటీల్లో అండర్-13,15,17 విభాగాలకు చెందిన బాల బాలికలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలు ఈనెల 21నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడాభివృద్ది అధికారిణి పూజారి శైలజ తెలిపారు.
News February 17, 2026
త్వరలో హాస్టళ్లలోని 1,433 పోస్టుల భర్తీ: సవిత

AP: సంక్షేమ హాస్టళ్లలోని 1,433 కుక్, లేబర్, పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. ‘142 కుక్, లేబర్, 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం. కొత్తగా 10 MJP BC గురుకులాలను నెలకొల్పుతాం. 6 గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తాం. పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకోసం ₹420CR, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ₹933 CR కేటాయించాం’ అని వివరించారు.


