News February 13, 2025
రూ.8వేలతో విశాఖ నుంచి కుంభమేళాకు

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి కుంభమేళాకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 16న ద్వారకా బస్సు స్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడుపబడునన్నారు. టికెట్ ధర రూ.8 వేలు. టికెట్స్ కావలసినవారు ఆన్‌లైన్ ద్వారా గాని, సమీప బస్ స్టేషన్లోగాని పొందవచ్చన్నారు.
Similar News
News March 20, 2025
109 కేసుల్లో 73 ఛేదించాం: విశాఖ సీపీ

విశాఖ సిటీలో ఫిబ్రవరి నెలలో నమోదైన 109 చోరీ కేసుల్లో 73 ఛేదించామని సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. రూ.33.21లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.60లక్షల విలువైన 419 ఫోన్లను రికవరీ చేశామన్నారు. 660.655 గ్రాముల బంగారం, 2.08 గ్రా. వెండి, రూ.2,73,575 నగదు,14 బైకులు, 2ల్యాప్‌టాప్‌లు, 2గేదెలు, 3లారీ బ్యాటరీలు, 57 సెంట్రింగ్ షీట్లను బాధితులకు అందజేశారు. మిగతా కేసులు ఛేదిస్తున్నామన్నారు.
News March 20, 2025
నితిన్ గడ్కరీతో విశాఖ ఎంపీ శ్రీభరత్ భేటీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని విశాఖ ఎంపీ శ్రీభరత్ గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం చేయాలని.. భోగాపురం విమానాశ్రయానికి మెరుగైన రహదారి నిర్మించాలని కోరారు. విశాఖ-ఖరగ్‌పూర్ కారిడార్‌పై చర్చించారు. ఈ రోడ్లు నిర్మాణం అయితే ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని కోరారు.
News March 20, 2025
దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.