News February 28, 2025
రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి: హోం మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో హోంశాఖకు రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి అని హోమ్ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ‘ఎక్స్’ వేదిగా హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖకు రూ.920 కోట్ల పెండింగ్ బకాయిల్లో ఇప్పటికే రూ.250 కోట్లు చెల్లించామన్నారు.
Similar News
News March 26, 2025
మంగళగిరి రైల్వే వంతెనకు కేంద్రం ఆమోదం

మంగళగిరి నగరంలోని నిడమర్రు రైల్వే వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేశ్‌ల వినతుల మేరకు మంగళవారం ఎల్సీ 14వద్ద ఆర్వోబీనీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సుమారు రూ.129.18 కోట్ల అంచనా వ్యయంతో.. కిలోమీటరు మేర 4 వరుసల రైల్వే వంతెన నిర్మాణం కానుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే అటు రాజధానితో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉపయోగకరంగా ఉంటుంది.
News March 26, 2025
ASF: KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
News March 26, 2025
‘కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగులు అప్లై చేసుకోండి’

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ శుభవార్త చెప్పారు. అవివాహిత పురుష అభ్యర్థులు అగ్ని వీర్ ఆర్మీ ఎంపికల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు.