News February 7, 2025
రూ.99లతో విజయవాడ నుంచి హైదరాబాద్

విజయవాడ-హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు. 3,4 వారాల తర్వాత ఇవి తిరుగుతాయన్నారు. బస్సు సేవలు మొదలైన తర్వాత రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ ఛార్జీ ఉంటుందన్నారు. ఈ విధంగా నాలుగు వారాల పాటు ఉంటుందన్నారు.
Similar News
News February 10, 2026
ప్రకాశం: ‘సొంత చెల్లిపై అన్న లైంగిక దాడి’

సొంత చెల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డ అన్నకు విజయవాడ పోక్సో కోర్టు సోమవారం ‘జీవిత ఖైదు’ విధించింది. ప్రకాశం(D) కొండపి(M) పెట్లూరుకి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు సంతానం. భార్య విడిపోయి ఇద్దరు కూతుర్లతో కృష్ణా జిల్లాకు వెళ్లగా కొడుకు తండ్రి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో అమ్మవద్దకు వెళ్లొస్తానన్న కొడుకు పెద్దచెల్లి(17)పై లైంగిక దాడి చేశాడు. కుమార్తె గర్భిణీ కాగా తల్లి కేసు పెట్టడంతో నిన్న శిక్ష పడింది.
News February 10, 2026
పార్వతీపురం: ‘ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ప్లాన్’

ఓ భార్య భర్తను చంపడానికి ప్రయత్నించిన ఘటన ఇది. పాచిపెంట(M) విశ్వనాథపురానికి చెందిన కిర్ల కుమార్, ఈశ్వరమ్మకు 20ఏళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల నుంచి ఈశ్వరమ్మకు తవిటి నాయుడితో వివాహేతర బంధం ఏర్పడింది. ఇటీవల భర్తకు ఈ విషయం తెలిసింది. దీంతో భార్య పక్కా ప్లాన్‌తో భర్తను పొలం వద్దకు తీసుకెళ్లగా.. అక్కడ ఆమె తన ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తపై కొడవలితో దాడి చేసింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
News February 10, 2026
నెల్లూరు: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీగా చదువు..!

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వీటికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు తల్లిదండ్రులు ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీలోగా గ్రామ సచివాలయం, MRCలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


