News January 30, 2025

రెంజల్: చెరువులో మహిళ మృతదేహం లభ్యం

image

మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రెంజల్​ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోర్గాం​ గ్రామానికి చెందిన స్వర్ణ, ఆమె భర్త పోతన్నకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. బుధవారం స్థానిక చెరువులో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 17, 2025

నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.