News April 13, 2025
రెంటచింతలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత

రెంటచింతల పరిసర ప్రాంతాలలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలుగా నమోదు అయినట్లు జంగమహేశ్వరంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచే రెంటచింతల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో ఎండ నిప్పుల కొలిమిని తలపించింది. గ్రామాలలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం మేఘావృతం అయింది. సాయంత్రానికి 27.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News October 24, 2025
భారీగా తగ్గిన వెండి ధరలు

వరుసగా నాలుగో రోజు కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై ధర రూ.3 వేలు తగ్గి రూ.1,71,000 వద్ద కొనసాగుతోంది. నాలుగు రోజుల్లోనే సిల్వర్ ధరలు కిలోకి రూ.19 వేలు తగ్గడం గమనార్హం. అటు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24K బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.1,25,460 వద్ద కొనసాగుతోంది. 22K 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.1,15,000గా ఉంది.
News October 24, 2025
పెద్దపల్లి: టెండర్లు ముగిశాయి.. లక్కీ డ్రాకి కౌంట్డౌన్ స్టార్ట్

2025-27 మద్యం దుకాణాల లైసెన్సులకు పెద్దపల్లి జిల్లాలో మొత్తం 1507 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అక్టోబర్ 18 వరకు 1378 దరఖాస్తులు రాగా, గడువు అక్టోబర్ 23 వరకూ పొడిగించడంతో గురువారం ఒక్కరోజే 113 కొత్త దరఖాస్తులు వచ్చాయి. డివిజన్ వారీగా PDPL 442, సుల్తానాబాద్ 305, RGM 474, మంథని 286 షాపులకు దరఖాస్తులు నమోదయ్యాయి. ఈనెల 27న లక్కీ డ్రా బంధంపల్లిలోని స్వరూప గార్డెన్ లో తీయనున్నట్లు తెలిపారు.
News October 24, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. కూకట్పల్లి సూర్య సేఫ్

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కూకట్పల్లి మూసాపేట్ Y జంక్షన్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన సూర్య (24) సేఫ్గా ఉన్నట్లు తెలుస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో సీట్ నెంబర్ ఎల్ 16 బుక్ చేసుకుని బెంగళూరుకు బయల్దేరగా కర్నూలు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో పలువురు మృతి చెందారు. సూర్య మాత్రం సేఫ్గా బయటపడ్డారు. సూర్య ఫొటో Way2Newsకు అందింది.


