News April 5, 2024
రెంటచింతలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

పల్నాడు జిల్లా రెంటచింతలలో శుక్రవారం 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో ఈ ఉష్ణోగ్రత నమోదవుతుందని మే 15 నుంచి 25 నాటికి ఉష్ణోగ్రతలు ఇక్కడ 50 డిగ్రీలకు మించుతుందని ఈ సంవత్సరం ఇప్పుడే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. రోహిణి కార్తెలో ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.
Similar News
News July 6, 2025
గుంటూరు: లోక్ అదాలత్‌లో 10,698 కేసులు పరిష్కారం

గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ సాధ్యమైన కేసులను పరిష్కరించారు. వాటిలో సివిల్ కేసులు 1,041, క్రిమినల్ 9,580, ప్రీలిటిగేషన్ 77, మొత్తం 10,698 కేసులు ఉన్నాయి. పరిష్కరించిన కేసుల విలువ మొత్తం రూ.50.96 కోట్లు ఉందని జడ్జి చక్రవర్తి తెలిపారు.
News July 5, 2025
గుంటూరు: కానిస్టేబుల్ కుటుంబానికి సహాయం

గుంటూరు జిల్లా 2012 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు రూ.1.35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు తండ్రికి రూ.35 వేలు, సతీమణికి రూ.లక్ష అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ క్రాంతి కుమార్ 2012 బ్యాచ్ సేవా, ఐక్యమత్యాన్ని ఎస్పీ ప్రశంసించారు. పోలీస్ శాఖ తరఫున కుటుంబానికి అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News July 5, 2025
తెనాలి: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.33కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.40, వంకాయ రూ.34, దొండ రూ.36, బెండ రూ.24 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.