News May 27, 2024

రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్

image

రెంటచింతల మండలంలోని రెంటాలలో ఈ నెల 13న ఏజెంట్లపై దాడి కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం. ఆంజనేయులు ఆదివారం తెలిపారు. దాడిలో గాయపడిన చేరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చేరెడ్డి మంజుల, గొంటు నాగమల్లేశ్వరరెడ్డి, చేరెడ్డి రఘురామిరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 12 మందిని గురజాల జూనియర్ సివిల్ జిడ్జి ముందు హాజరు పరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News December 5, 2025

GNT: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆదేశాలు

image

సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల నియంత్రణ ఇతర ప్రాధాన్య ఆరోగ్య అంశాలపై గురువారం సచివాలయం నుంచి విజయానంద్ అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ వీసీలో పాల్గొన్నారు.

News December 4, 2025

APCRDA “గ్రీవెన్స్ డే” నిర్వహణలో స్వల్ప మార్పు

image

అమరావతిలో తుళ్లూరు CRDA కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతున్న గ్రీవెన్స్ డే.. ఇకపై ప్రతి శనివారం రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడుతుందని CRDA అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రతి శనివారం – రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్ డే నిర్వహించబడుతుందన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఈ మార్పును గమనించాలని కోరారు.

News December 4, 2025

అమరావతి: బ్లడ్ టెస్టుల పేరుతో భారీగా వసూళ్లు

image

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలు రక్తాన్ని పీల్చినట్లు సామాన్యుల నుంచి డబ్బులు లాగేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు రోగనిర్ధారణ టెస్టుల పేరుతో రక్త పరీక్షలు చేయించాలని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ ల్యాబ్‌లకు సిఫార్సు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, అధికారుల తనిఖీలు కరువయ్యాయని వాపోతున్నారు. మీ ఏరియాలో పరిస్థితిపై కామెంట్ చేయండి.