News March 15, 2025
రెంటచింతల: ఔరంగజేబు నిర్మించిన మసీదు ఇదే.!

మొగల్ చక్రవర్తి ఔరంగజేబు చేత నిర్మించబడిన చారిత్రాత్మక మస్జిద్ ఏ అలంగిర్ రెంటచింతల మండల పరిధిలోని తుమృకోట గ్రామంలో ఉంది. దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా 24 సంవత్సరాలు పాటు తుమృకోటను రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్ర చెబుతుంది. 1667లో మసీదును నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. మొగల్ చక్రవర్తులు నిర్మించిన కట్టడాలను కాపాడుతున్న ప్రభుత్వాలు మస్జిద్ ఏ అలంగిర్‌కు పూర్వవైభవం తేవాలని కోరుతున్నారు.
Similar News
News November 8, 2025
అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.
News November 8, 2025
కృష్ణా: అలర్ట్..పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా NOV 17లోపు, రూ. 200 ఫైన్‌తో NOV 19లోపు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది.
News November 8, 2025
MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.


