News November 16, 2024

రెంటచింతల: కృష్ణా నదిలో దంపతులు గల్లంతు

image

కృష్ణానదిలో కార్తీక స్నానం చేయడానికి వెళ్లిన దంపతులు గల్లంతైన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన నీలా సత్యనారాయణ, పద్మావతిలు శనివారం కార్తీక స్నానమాచరించడానికి సత్రశాల వెళ్లినట్లు వారి బంధువులు తెలిపారు. భార్య పద్మావతి నీటిలోకి జారిపోవడంతో ఆమెను కాపాడేందుకు భర్త వెళ్లాడన్నారు. జాలర్లు పద్మావతి మృతదేహాన్ని వెలికి తీశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News November 22, 2025

గుంటూరు కలెక్టరేట్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు!

image

గుంటూరు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తామని DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఓ నేత్ర వైద్యశాల మొబైల్ ఐ క్లినిక్ ద్వారా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఆద్వర్యంలో వీటిని ఏర్పాటుచేసినట్లు, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని DMHO వివరించారు.

News November 21, 2025

మేడికొండూరు: నిన్న కూతూరి పెళ్లి.. ఇవాళ గుండెపోటుతో తండ్రి మృతి

image

నిన్నటి పెళ్లి పందిరిలో సందడి ఇంకా ముగియక ముందే మేడికొండూరు మండలం డోకిపర్రులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్ల సుదీర్ఘ కాలంగా సీనియర్ పాత్రికేయుడిగా సేవలందిస్తున్న దావాల వెంకట రావు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నిన్ననే తన కూతురి వివాహాన్ని జరిపించి, ఆ ఆనందంలో ఉండగానే విధి ఇలా చిన్నచూపు చూసింది. మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

News November 21, 2025

వర్షాలు పడే అవకాశం పంటలు జాగ్రత్త: కలెక్టర్

image

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 27, 28న వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. నూర్పిడి జరిగిన పంటలు, కోతలు కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించాలని, ధాన్యం వర్షానికి తడవకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.