News March 25, 2024
రెంటచింతల: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తరలి వ్యక్తి మృతి చెందిన ఘటన రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంట మణికంఠ రెడ్డి (32) తన ఇంటి ఎదురుగా ఉన్న విద్యుత్ మోటారు పట్టుకోగా షాక్ తగిలి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News January 18, 2026
సరస్ మేళాకు రూ.25కోట్ల ఆదాయం: కలెక్టర్

గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజార్ రికార్డు సృష్టించింది. మొత్తం 343 స్టాల్స్ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25కోట్ల ఆదాయం వచ్చింది. ఆదివారం జరిగిన సరస్ ముగింపు సభలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ విషయాన్ని వెల్లడించారు. సరస్ మేళా టెస్ట్ మ్యాచ్ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామం కలెక్టర్ కొనియాడారు.
News January 17, 2026
ANU: ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం

ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారుల అవగాహన కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని OSD ఆచార్య రవికుమార్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ (ఇన్‌ఫ్లిబ్‌నెట్) సెంటర్, గాంధీనగర్, గుజరాత్, ఉన్నత విద్యా కమిషనరేట్ AP, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 20వ తేదీలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News January 17, 2026
వైన్ షాపుల వద్దే పండుగ జరుగుతుంది: అంబటి

జగన్ పాలన తిరిగి వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో శనివారం దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత కమిటీ నిర్మాణంపై సమావేశం జరిగింది. రాష్ట్రంలో పండుగ అంటే వైన్ షాపులు దగ్గరే జరుగుతుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పథకాలు అందేవని వాటితో వారు పండగలు నిర్వహించుకునేవారని అంబటి అన్నారు.


