News July 25, 2024

రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. గురువారం ఉదయం 6 గంటలకు 46.1 అడుగు ఉన్న గోదావరి 9 గంటలకు 47.1 అడుగుకు చేరింది. ఉదయం 11 గంటలకు 47.5 అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువ కానుంది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే గోదావరి పరివాహకంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Similar News

News November 14, 2025

భూ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం నిర్వహించిన వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనర్హుల దరఖాస్తులను డెస్క్ స్క్రూటినీలో తిరస్కరించాలని, అర్హుల దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో తప్పనిసరి పరిశీలన చేయాలన్నారు.

News November 14, 2025

ఖమ్మంలో దడ పుట్టిస్తున్న చలి

image

ఖమ్మం జిల్లాలో గత నాలుగు రోజులుగా వీస్తున్న చలిగాలుల తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోయాయి. ఈ చలికి హాస్టల్ విద్యార్థులు, వృద్ధులు వణికిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో వైరల్ న్యుమోనియా వ్యాప్తి చెందుతుండటంతో పిల్లలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందులను నిర్లక్ష్యం చేయవద్దని, చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు ప్రజలకు సూచించారు.

News November 14, 2025

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డయాబెటిస్ బాధితులు

image

ఖమ్మం జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో 13,35,202 జనాభా ఉన్నారు. వీరిలో మధుమేహం లక్షణాలు ఉన్నవారు 55,829, అధిక రక్తపోటు ఉన్నవారు 77,604 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందిని ఎన్సీడీ పోర్టల్‌లో నమోదు చేసి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేల్లో జిల్లా మధుమేహ వ్యాప్తిలో 10వ జాబితాలో చేరింది. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’