News April 10, 2024
రెండింటిలోనూ చింతా మోహన్ హ్యాట్రిక్

కాంగ్రెస్ తిరుపతి MP అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గెలుపు, ఓటమిలో హ్యాట్రిక్ కొట్టారు. ఆయన 1984లో టీడీపీ అభ్యర్థిగా, 1989, 1991లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1996లో పోటీ చేయలేదు. 1999లో ఓడిపోయారు. 2004, 2009లో గెలిచారు. 2014, 2019, 2021లో హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్నారు. 2021 ఉప ఎన్నికల్లో 9585 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 11వ సారి పోటీ చేస్తున్నారు.
Similar News
News March 24, 2025
పోలీస్ కుటుంబాలు నన్ను తిట్టుకుంటున్నాయి: MLA

చిత్తూరు జిల్లాలో పోలీసు కుటుంబాలు తనను తిట్టుకుంటున్నాయని పలమనేరు MLA అమర్‌నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య అనంతరం వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని మార్చమని అడిగితే.. SP ఇష్టానికి బదిలీలు చేశారని ఆరోపించారు. దీంతో వారి భార్యా పిల్లలు తనను ద్వేషిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు శాశ్వతం కాదని, అధికారులే శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు.
News March 24, 2025
చిత్తూరు: మహిళా VRO ఆత్మహత్య

చిత్తూరులోని సంజయ్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న ముత్తుకూరు VRO తనీషా (31) కుటుంబ కలహాలతో శనివారం విషం ద్రావణం తాగారు. కుటుంబ సభ్యులు గమనించి చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఏడేళ్ల క్రితం రమేశ్‌తో తనీషాకు వివాహమైంది. వారికి పిల్లలు లేరు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. కాగా రమేశ్ ఆర్మీలో పని చేస్తున్నారు.
News March 24, 2025
రూ.1.14 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు

విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. రెండు జిల్లాలలో మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా.. కోట్లు వసూలు అయినట్లు ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వెల్లడించారు.