News February 28, 2025

రెండు కార్పొరేట్ పాఠశాలలకు నోటీసులు

image

నర్సీపట్నంలో రెండు వివిధ కార్పొరేట్ పాఠశాలలకు ఎంఈవో తలుపులు నోటీసులు జారీ చేశారు. బుధవారం శివరాత్రి, గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఉల్లంఘించి పాఠశాలలు తెరిచిన విషయం ఎంఈవో దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన నోటీసులు జారీ చేశారు. విషయం డీఈవో దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Similar News

News October 30, 2025

జీవ ముక్తికి మార్గం ఈ కార్తీక మాసం

image

ఈ పవిత్ర మాసంలో కార్తీక వ్రతం ఆచరించేవారు జీవన్ముక్తులు అవుతారు. స్త్రీ, పురుష, వయో భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా చేయనివారు ‘అంధతామిత్రము’ అనే నరకాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో కావేరీ నదీ స్నానం, దీపారాధన, దీపదానం చేయడం పుణ్యప్రదం. ధన-ధాన్య-ఫల దానాలు కూడా అమిత ఫలదాయకాలు. ఈ 30 రోజులు కార్తీక మహాత్మ్యాన్ని చదివినా, విన్నా జీవన్ముక్తి లభిస్తుంది. <<-se>>#Karthikam<<>>

News October 30, 2025

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగాలో ఉద్యోగాలు

image

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా 9 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ(యోగా& నేచురోపతి), పీహెచ్‌డీ, CA/ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.yogamdniy.nic.in/

News October 30, 2025

NZB: బాబ్లీ ప్రాజెక్టులోకి వరద.. గేట్లు ఎత్తివేత..!

image

నిజమాబాద్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టులోకి పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో, అధికారులు పాక్షికంగా కొన్ని గేట్లను ఎత్తివేశారు. వరద ప్రవాహం ఉన్నంత వరకు గేట్లను తెరిచి ఉంచుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో SRSP SE వి.జగదీష్, AEE కొత్త రవి, CWC EE ఫ్రాంక్లిన్, SDE ఏ.సతీష్, నాందేడ్ EE C.R.బన్సాద్ తదితరులు పాల్గొన్నారు.