News August 18, 2024

రెండు కార్లు ఢీ.. ఎడుగురికి తీవ్ర గాయాలు

image

నేలకొండపల్లి మండలంలోని తిరుమలపురం వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఎడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 24, 2025

ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన

image

ఖమ్మం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. సుమారు 250 మంది విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని, క్యాంపస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. లక్షల ఫీజులు చెల్లించినా రుచిలేని భోజనం పెడుతున్నారని, ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

News November 24, 2025

రేపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు: భట్టి

image

రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సీఎస్ కే.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. చీరల పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పీఎంఏవై అంశాలపై చర్చించారు.

News November 24, 2025

KMM: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

image

ఖమ్మం జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.