News February 7, 2025
రెండు కుటుంబాలను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్(21), తరుణ్(19) <<15378854>>మృతి చెందిన<<>> సంగతి విదితమే. సరదాగా బైక్‌పై బయటకు వెళ్లిన ఇద్దరినీ మృత్యువు కబళించింది. కాగా చిన్న వయస్సులోనే ఇంటి బాధ్యతలు మోస్తున్న యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కార్తీక్ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం రవాణా కూలీగా చేస్తున్నారు. తరుణ్ ఓ బట్టల షాపులో పని చేస్తున్నారు.
Similar News
News March 28, 2025
శ్రీకాకుళం : తమ్ముడు చనిపోతే అప్పుతీర్చలేనని అన్న సూసైడ్

తమ్ముడు చనిపోతాడేమోనని అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన సిక్కోలులో గురువారం జరిగింది. రూరల్ SI కె. రాము కథనం..సారవకోటలోని అలుదుకు చెందిన సూరి(40),అతని తమ్ముడు గ్రానైట్ వ్యాపారం చేసేవారు. అయితే నష్టం రాగా.. ఉమామహేశ్వరరావు విషం తాగాడు. రాగోలు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు బతకడం కష్టమన్నారు. చేసిన అప్పులు తీర్చలేనని అన్న ఆసుపత్రి వద్ద తీసుకున్న గదిలో ఉరివేసుకున్నాడు. దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
News March 28, 2025
సోంపేట : మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం

సోంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ సుంగారపు ప్రసాద్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News March 28, 2025
వారిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి: కేంద్రమంత్రి రామ్మోహన్

ఆంధ్రప్రదేశ్‌లోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, సోండీ, అరవల కులాలను కేంద్రీయ వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్‌కి సిఫారసు చేశారు. గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి వీరేంద్ర కుమార్‌తో భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. వీరిని ఓబీసీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలన్నారు.