News March 6, 2025

రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలి: కలెక్టర్

image

రెండు జతల ఏకరూప దుస్తులను సకాలంలో విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏకరూప దుస్తుల తయారీపై సంబంధిత జిల్లా అధికారులు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో కుట్టాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు.

Similar News

News March 6, 2026

NRPT: ‘మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలి’

image

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని OMIF ఆధ్వర్యంలో నారాయణపేట శిల ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని 10 కేంద్రాలలో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు, బ్యూటీ పార్లర్ కిట్లు సర్టిఫికెట్లు అందించారు. మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే విద్యా ముఖ్యమని చెప్పారు.

News March 6, 2026

ANUలో పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్/ నవంబర్ నెలలో జరిగిన పలు కోర్సుల పరీక్షల ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. బి.ఏ/బి.బి.ఏ, యల్.యల్.బి, యమ్.బి.ఏ, తదితర పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్, ఇతర పూర్తి వివరాల కోసం వెబ్సైట్‌ను www.nagarjunanuniversity.ac.in సంప్రదించాలన్నారు.

News March 6, 2026

మరోసారి బొత్సకు అస్వస్థత

image

AP: శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లో <<19252802>>చికిత్స<<>> తీసుకున్న విషయం తెలిసిందే.