News August 6, 2024
రెండు పంటలకు సాగునీరు : కలెక్టర్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది పూర్తిస్థాయిలో 2 పంటలకు సాగునీరు అందిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యానికి చేరువలో ఉన్నందున సోమవారం ఆయన ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తెరిచి సాగునీటిని దిగువకు వదిలివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 584 అడుగుల మేర నీరు ఉందని, 14 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
Similar News
News September 13, 2024
ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ: జిల్లా కలెక్టర్
ఇవాళ ఫొటో ఓటరు జాబితాను ఆయా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ముసాయిదా ఫొటో ఓటరు జాబితాపై ఈనెల 18న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ, 19న మండల స్థాయిలో MPDOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
News September 13, 2024
ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్
ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామపంచాయతీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ తెలిపారు.
News September 12, 2024
‘ఆ లక్ష్యం సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలి’
కష్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు. గురువారం ఆయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్‌ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని తెలిపారు.