News August 5, 2024
రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గోలేటి వాసి

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గౌతమ్ నగర్కి చెందిన రాజ్ కుమార్ ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాజ్ కుమార్ ఇరిగేషన్ AEEగా ఎంపికయ్యారు. ఇప్పటికే రాజ్ కుమార్ పోలీసు కానిస్టేబుల్ (సివిల్)గా 2020లో ఎంపికై ఆసిఫాబాద్ హెడ్ క్వార్టర్లో స్పెషల్ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
Similar News
News November 18, 2025
ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్సైట్ను చూడాలని ఆయన సూచించారు.

ADB: ఫిర్యాదులు విన్న వెంటనే పరిష్కారానికి ఆదేశం: ఎస్పీ

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన విన్నారు. ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల ప్రజలు 8712659973 నంబర్కు వాట్సాప్తో సమస్యలు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.