News February 7, 2025
రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిన్న రాత్రి మృతిచెందాడు. క్రిష్ణగిరి(M) తొగిడిచెడుకు చెందిన పెద్ద గిడ్డయ్య, ఆయన భార్య ఈనెల 4న పొలం పనులకు వెళ్తుండగా.. అదే మార్గాన కొత్తూరుకు చెందిన శివ తొగిడిచెడుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి బైక్‌లు ఢీకొన్నాయి. గిడ్డయ్యకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్థులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News February 25, 2026
2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

AP: 2018 బ్యాచ్ గ్రూప్-1 నుంచి ఎంపికైన అధికారులందరినీ రిలీవ్ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రిక్రూట్‌మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. కాగా 2018 నోటిఫికేషన్ ద్వారా 167 మంది గ్రూప్-1 అధికారులుగా ఎంపికయ్యారు. వీరు గత రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో విధుల్లో ఉన్నారు.
News February 25, 2026
ప్రగతిలో మార్టూరు అగ్రగామిగా నిలవాలి: కలెక్టర్

నెల రోజుల్లో మార్టూరు మండలం అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. మండల స్థాయి అధికారులు సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ర్యాంకింగ్ ఇచ్చి అభినందిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల కోసం తప్పనిసరిగా కుర్చీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News February 25, 2026
దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


