News February 7, 2025

రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిన్న రాత్రి మృతిచెందాడు. క్రిష్ణగిరి(M) తొగిడిచెడుకు చెందిన పెద్ద గిడ్డయ్య, ఆయన భార్య ఈనెల 4న పొలం పనులకు వెళ్తుండగా.. అదే మార్గాన కొత్తూరుకు చెందిన శివ తొగిడిచెడుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి బైక్‌లు ఢీకొన్నాయి. గిడ్డయ్యకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్థులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News February 13, 2026

అనంతపురం జిల్లాలో పదోన్నతులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల యూనిట్ నుంచి ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా ఐదుగురికి కలెక్టర్ ఆనంద్ పదోన్నతి కల్పించినట్లు DPO నాగరాజు నాయుడు తెలిపారు. పదోన్నతి పొందిన ఐదుగురు ఉద్యోగులకు త్వరలోనే పంచాయతీలు కేటాయిస్తామన్నారు.

News February 13, 2026

బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయండి: అవామీ లీగ్

image

బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయాలని నిషేధిత అవామీ లీగ్ పార్టీ డిమాండ్ చేసింది. నియంత యూనస్ నిర్వహించిన ఈ ఎలక్షన్స్ హాస్యాస్పదమని పేర్కొంది. నిన్న 3 గంటల వ్యవధిలో 14.96% ఓటింగ్ నమోదవ్వడం ప్రజా వ్యతిరేకతను చూపించిందని ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రాబోయే రోజుల్లో అవామీ లీగ్ మద్దతుదారులపై దాడులు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాహిత ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరింది.

News February 13, 2026

త్వరలో మెస్ ఛార్జీలు పెంపు: మంత్రి సవిత

image

AP: బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాల్లో త్వరలోనే మెస్ ఛార్జీలు పెంచనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నోడల్ శాఖ ఆధ్వర్యంలో ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2014-19 మధ్య కాలంలోనూ అప్పటి TDP ప్రభుత్వం 66% మేర మెస్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు.